Sunday, December 22, 2024

కమల్ నాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

Kamal Nath's helicopter makes an emergency landing

భోపాల్: వాతావరణం అనుకూలంగా లేని కారణంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా సెహోర్ నగరంలోని ఒక కళాశాల మైదానంలో దిగింది. ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పైలట్లు ఇక్కడ దింపారు. అగర్ మాల్వాలో ఒక ర్యాలీలో పాల్గొని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కమల్‌నాథ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్, మరో కాంగ్రెస్ నాయకుడు అగ్రవాల్ భోపాల్ తిరిగివస్తున్నట్లు కమల్‌నాథ్‌కు చెందిన మీడియా సమన్వయకర్త నరేంద్ర సలూజా తెలిపారు. భోపాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని సెహోరాలోని కళాశాల మైదానంలో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కాగా వీరు ముగ్గురూ అక్కడ నుంచి కారులో భోపాల్ బయల్దేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News