Sunday, January 19, 2025

నేటి నుంచి కమలనాథుల విస్తృత ప్రచారం

- Advertisement -
- Advertisement -

నేడు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ పలు సభలు, రోడ్‌షోలకు హాజరు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కమలం పార్టీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే మూడు రోజుల పర్యటన వివరాలను పార్టీ సీనియర్లు వెల్లడించారు. నేటి నుంచి 26వ తేదీ వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 24న ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్ నియోజకవర్గం, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్‌లో జరగనున్న బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం వివరాలు:
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్ లో జరుగునున్న సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రసంగించి, మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, మధ్యాహ్నం 3 గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గంలో రోడ్ షో ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా 25న(శనివారం) ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పటాన్ చెరు నియోజకవర్గం సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు.

26న(ఆదివారం) ఉదయం 11 గంటలకు మక్తల్ నియోజకవర్గం, మధ్యాహ్నం 1 గంటకు ములుగు నియోజకవర్గం, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కూకట్ పల్లిలో బహిరంగ సభలో మాట్లాడి రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈనెల 25న జెపి నడ్డా ఎన్నికల ప్రచారం: 
అదే విధంగా ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా మధ్యాహ్నం 2 గంటలకు హుజూర నగర్ బహిరంగసభ, సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గం, సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రాత్రి 7 గంటలకు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News