Wednesday, January 22, 2025

గెలుపు మొగ్గు కమలా హారిస్ కే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. నవంబర్ 5న(రేపే) ఓటింగ్.  అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకోగానే ఇప్పుడు అందరి దృష్టి స్వింగ్ స్టేట్స్ పైనే ఉన్నాయి.  అమెరికా ఎన్నికల ఫలితాలను మూడు రకాల రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. వీటిని రెడ్, బ్లూ, స్వింగ్ స్టేట్స్ అంటారు. 1980 నుంచి రిపబ్లికన్స్ విజయం సాధిస్తున్న వాటిని రెడ్ స్టేట్స్ అంటారు. అలాగే 1992 నుంచి డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను బ్లూ స్టేట్స్ అంటారు. ఇక స్వింగ్ స్టేట్స్ లో రెండు పార్టీల మధ్య గెలుపోటమలు దోబూచులాడుతాయని భావిస్తారు. ఈసారి ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలువనున్నారు. ఎందుకంటే పోటీ చాలా తీవ్రంగా ఉన్నది.

రాయిటర్స్/ఐపిఎస్ఓఎస్ పోల్ గత వారం అక్టోబర్ 29న ప్రచురించిన దాని ప్రకారం కమలా హారిస్ కే ఆధిక్యత ఉంది. సింగిల్ పర్సంటేజ్ ఆధిక్యతతో డెమోక్రట్లు ఉన్నారు.  డెమోక్రాట్లు 44 శాతం, రిపబ్లికన్లు 43 శాతం మేరకు ఓట్లు పొందనున్నారని అంచనా. ఓ సర్వే ప్రకారం స్వింగ్ స్టేట్స్ – అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ లలో రిపబ్లికన్ నామినికే మొగ్గు ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News