Saturday, November 16, 2024

బ్లెయిర్‌హౌస్‌లోకి కమలాహారిస్

- Advertisement -
- Advertisement -

Kamala Harris move to Blair House

 

అధికారిక నివాసానికి మరమ్మతులు

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తన అధికారిక నివాసంలో కాకుండా తాత్కాలికంగా చారిత్రక బ్లెయిర్ హౌస్‌లో ఉండనున్నారు. వైట్‌హౌస్ పక్కనే బ్లెయిర్ హౌస్ ఉన్నది. ఉపాధ్యక్షురాలి అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు వాయువ్య దిశలో ఏడు కిలోమీటర్ల దూరంలో నావల్ ఆబ్జర్వేటరీ కాంప్లెక్స్‌లో ఉన్నది. అయితే, దానిలో ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నందున తాత్కాలికంగా కమలాహారిస్ బ్లెయిర్‌హౌస్‌లో ఉంటారని ఆమె అధికారిక ప్రతినిధి సైమోన్ సాండర్స్ తెలిపారు. గురువారం హారిస్ తన భర్త డగ్‌ఎమ్‌హాఫ్‌తోపాటు బ్లెయిర్ హౌస్‌కు వెళ్తారు. బ్లెయిర్‌హౌస్‌ను సాధారణంగా అధ్యక్షుడి అతిథి గృహంగా వినియోగిస్తారు. అధ్యక్షుడితో చర్చల కోసం వచ్చే దేశాల అధినేతలకు అక్కడ ఆతిథ్యం ఏర్పాటు చేస్తారు. 1824లో నిర్మించిన బ్లెయిర్‌హౌస్‌లో 120 గదులున్నాయి. 1893లో నిర్మించిన ఉపాధ్యక్షుల అధికారిక నివాసంలో 33 గదులున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News