- Advertisement -
భోపాల్: భారత్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో ఇది భారత్ వేరియంట్ అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దేశ శాస్త్రవేత్తలు కూడా ఇది భారత్ వెరియంట్ అని పిలుస్తున్నారని మోడీ ప్రభుత్వానికి చురకలంటించారు. కరోనా వైరస్ చైనా పుట్టినిల్లుగా కాగా భారత్ కరోనా వెరియంట్ మాత్రం వణికిస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ఈ వేరియంట్ అంటే భయపడుతున్నారని వ్యంగస్త్రాలు సంధించారు. కమల్ నాథ్ వ్యాఖ్యలపై బిజెపి ప్రతినిధులు రీకౌంటర్ ఇచ్చారు. కమల్ నాథ్ వ్యాఖ్యలను బిజెపి తోసిపుచ్చిందని, కాంగ్రెస్ టూల్ కిట్‌లో భాగంగా భారత్ వేరియంట్ అంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపాడు.
- Advertisement -