హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై లారీని ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన అనంతరం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బస్సు ఢీకొట్టినట్టు సమాచారం. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొడ మండలం రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు సురేష్(21), సాయన్న(45)గా గుర్తించారు. మృతదేహాలు బోధ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలో ఒఆర్‌ఆర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కూడా ఇద్దరు మృతి చెందారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు : ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -