Monday, December 23, 2024

అంకుష్ ఖాన్ చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి…

- Advertisement -
- Advertisement -

బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఉన్న అంకుష్ ఖాన్ చెరువులో కాలకృత్యాలకు వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. అభిషేక్ బిర్కూర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు కాగా గణేష్ బాన్సువాడలో బైక్ మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు. వీరిద్దరూ ఉదయం బైక్ పై చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అభిషేక్ అందులో పడిపోగా అతని రక్షించడానికి గణేష్ కూడా అందులో దూకగా ఇద్దరు కూడా మృతి చెందారు.

సాయంత్రం వరకు ఇద్దరు కూడా తమ తమ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు చెరువు వద్ద ఉన్న బైక్ చెప్పులను గమనించి చెరువులో పడి ఉండవచ్చని గజ ఈతగాలతో రాత్రంతా గాలింపు చేపట్టారు. సోమవారం రాత్రి గణేష్ మృతదేహం లభించగా మంగళవారం ఉదయం అభిషేక్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకులు తిమ్మాపూర్ గ్రామస్థులు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News