Thursday, January 23, 2025

బీబీపేటలో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బీబీపేట: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… కోనాపూర్‌లో ప్రేమ జంట సాయి కుమార్(24), వీణ(22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటుకున్నారు. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటామని ఇరు కుటుంబ సభ్యులకు తెలిపడంతో వారు నిరాకరించారు. కలిసి ఉండగా బతకలేమని ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇరు కుటుంబాల సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కోనాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News