Wednesday, January 22, 2025

గర్భవతి ఫిర్యాదు… ఎస్‌ఐ కొట్టాడని ఎలుకల మందు తాగాడు…

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: అక్రమ సంబంధం పెట్టుకొని తనని గర్భవతిని చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనని ఎస్‌ఐ కోట్టడంతో ఆత్మహత్య చేసుకున్నానని సదరు వ్యక్తి ఆరోపణలు చేసిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాతలింగాల గ్రామంలో దుర్గా ప్రసాద్, ప్రసన్న అనే దంపతులు నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని గర్భవతిని చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో దుర్గా ప్రసాద్‌పై మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లగానే అతడు ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలిసి వెంటనే అతడి భార్య ప్రసన్న ఆటో తీసుకొని బయలుదేరింది. మార్గం మధ్యలో ఆటో డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో వాహనంలో నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళతో తనకు సంబంధం లేదని, తన భార్యను ఎస్‌ఐ బూతులు దూషించడంతో పాటు కొట్టాడని, అందుకే తాను ఎలుకల మందు తాగానని దుర్గా ప్రసాద్ వివరణ ఇచ్చాడు. తన భర్త సక్రమంగా చూడటం లేదని, ప్రస్తుతం తాను గర్భవతిని అని ఓ మహిళ ఫిర్యాదు చేస్తే ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని వివరణ ఇచ్చాడు. దుర్గా ప్రసాద్, ఆయన భార్యపై అసభ్యపదజాలం ఉపయోగించలేదని ఎస్‌ఐ వివరణ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News