Sunday, December 22, 2024

ప్రేమ గారడీ సాంగ్ చూడాల్సిందే…

- Advertisement -
- Advertisement -

‘అమ్మాయికి మనసులోని ప్రేమను చెప్పాలంటే, ఆమె ఆ ప్రేమకు వెంటనే ఎస్ చెప్పాలంటే సాధారణ విషయం కాదు.. మరీ పుట్టి పెరిగిన పల్లెటూర్లో అయితే ఎవరెక్కడ చూస్తారోనని అమ్మాయి, అబ్బాయి ప్రేమ ఊసులు చెప్పుకోవటం మరీ కష్టం. అలాంటి కష్టాన్ని హాయిగా అనుభవిస్తోన్న కుర్రాడు మనసులోని ‘ప్రేమ గారడీ..’ని నచ్చిన అమ్మాయికి ఎలా చెప్పాడనేది తెలుసుకోవాలంటే విడుదలకు సిద్ధమవుతోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోన్నఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయటం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం ఈ సినిమా నుంచి ‘ప్రేమ గారడీ..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలోని ‘ప్రేమ గారడీ..’ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా అర్మాన్ మాలిక్ పాడారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News