Tuesday, December 3, 2024

కామ్రాన్ అద్భుత శతకం.. పాక్ 259/5

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (7) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్ కూడా నిరాశ పరిచాడు. మసూద్ 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో పాకిస్థాన్ 19 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ రెండు వికెట్లు కూడా జాక్ లీచ్‌కే దక్కడం విశేషం.

ఆదుకున్న అయూబ్, కామ్రాన్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కామ్రాన్ గులాం, ఓపెనర్ సైమ్ అయూబ్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఇటు అయూబ్ అటు కామ్రాన్ అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయూబ్ 160 బంతుల్లో ఏడు ఫోర్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ క్రమంలో మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన సౌద్ షకిల్ (4) నిరాశ పరిచాడు. కానీ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి కామ్రాన్ జోరును కొనసాగించాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన కామ్రాన్ 224 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. మంగళవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రిజ్వాజ్ (37), ఆఘా సల్మాన్ (5) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో లీచ్ రెండు వికెట్లు తీశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News