Friday, December 20, 2024

హరిత హోటల్లో చిట్స్ వ్యాపారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వరంగల్ : హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో కనకదుర్గ చిట్‌ఫండ్స్ మాజీ డైరెక్టర్ నల్ల భాస్కర్ రెడ్డి ఫ్యాన్‌కి చున్నీతో ఉరేసుకొని ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డా డు. భాస్కర్ రెడ్డి గతంలో కనకదుర్గ చిట్‌ఫండ్ డైరెక్టర్‌గా చాలాకాలం పని శారు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు రెండు రోజుల క్రితం హరిత హోటల్లో ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.

శనివారం రాత్రి కూడా తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. మధ్యాహ్నం వరకు బయట రాకపోవడంతో హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై సుబేదారి సిఐ సుకుర్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు. కాగా, భాస్కర్ రెడ్డి చాలాకాలం క్రితమే తమ కంపెనీలో ఉద్యోగం మానేశాడని, అతనికి తమ కంపెనీకి సంబంధం లేదని కనకదుర్గ చిట్ ఫండ్స్ యజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News