Friday, December 27, 2024

గూడ్స్ రైలు డ్రైవర్ తప్పు లేదు

- Advertisement -
- Advertisement -

సోమవారం పశ్చిమ బెంగాల్‌లో రాణిపత్రా రైల్వే స్టేషన్, ఛత్తర్ హాట్ జంక్షన్ మధ్య కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌లోకి దూసుకుపోయిన గూడ్స్ రైలుకు ఆటోమేటిక్ సిగ్నలింగ్ ‘వైఫల్యం’ కారణంగా ఎర్ర సిగ్నళ్లు అన్నిటినీ దాటుకుని వెళ్లేందుకు అనుమతి ఉందని అంతర్గత పత్రాలు వెల్లడించాయి. అన్ని ఎర్ర సిగ్నళ్లను దాటుకుని వెళ్లేందుకు అధికారం ఇస్తూ రాణిపత్రా స్టేషన్ మాస్టర్ గూడ్స్ రైలు డ్రైవర్‌కు టిఎ 912 అనే లిఖిత అధికార పత్రాన్ని జారీ చేసినట్లు రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘ఆటోమేటిక్ సిగ్నలింగ్ విఫలమైంది. ఆర్‌ఎన్‌ఐ (రాణిపత్రా రైల్వే స్టేషన్), సిఎటి (ఛత్తర్ హాట్ జంక్షన్) మధ్య అన్ని ఆటోమేటిక్ సిగ్నళ్లు దాటి వెళ్లేందుకు మీకు ఇందుమూలంగా అధికారం ఇవ్వడమైంది’ అని ఆ పత్రం తెలిపింది. ఆర్‌ఎన్‌ఐ, సిఎటి మధ్య తొమ్మిది సిగ్నళ్లు ఉన్నాయని కూడా అది పేర్కొన్నది.

సిగ్నళ్లు ఎరుపు లేదా హెచ్చరిక (పసుపు పచ్చ లేదా ముదురు పసుపు పచ్చ) సూచించినా పట్టించుకోకుండా వేగంగా అన్నిటినీ దాటి వెళ్లేందుకు గూడ్స్ రైలు డ్రైవర్‌కు అది అధికారం ఇస్తోంది. ‘సెక్షన్‌లో లైన్‌పై ఏ అవరోధమైనా గాని, ఏ రైలు గాని లేనప్పుడు టిఎ 912 జారీ చేస్తుంటారు. అది ఎర్ర లేదా హెచ్చరిక సిగ్నళ్లు దాటి వెళ్లేందుకు డ్రైవర్‌కు అధికారం ఇస్తుంది. స్టేషన్ మాస్టర్ ఆ పని ఎందుకు చేశారనేది దర్యాప్తు విషయం. అంతకు ముందు రైలు స్టేషన్ సెక్షన్ దాటి, మరొక సెక్షన్‌లోకి ప్రవేశించిందనే అభిప్రాయంతో ఆయన ఉండి ఉండవచ్చు’ అని రైల్వే ప్రతినిధి వివరించారు. ఆర్‌ఎన్‌ఐ, సిఎటి మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సోమవారం తెల్లవారు జామున 5.50 నుంచి సరిగ్గా పని చేయడం లేదని ఆ ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News