Wednesday, November 20, 2024

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిది నోరా? మూసీ నదా?: కంచర్ల

- Advertisement -
- Advertisement -

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నోరు
మూసీ నది కన్నా అధ్వాన్నంగా మారింది
బిఆర్‌ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నోరు మూసీ నది కన్నా అధ్వాన్నంగా మారిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మూసీ నది ఏ విధంగా ఉండేదో రైతులను అడిగితే తెలుస్తుందని అన్నారు. మూసీకి కాలుష్యం లేకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం నీళ్లను అందించిందని, మూసీ పరివాహక ప్రాంతంలో పంటలు పండుతున్నాయని చెప్పారు. కోమటిరెడ్డి తాగి ఏం మాట్లాడతారో తెలియదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ ఎంఎల్‌ఎలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డిలతో ఆయన మీడియాతో మాట్లాడారు.

కోమటిరెడ్డి సోదరులు నల్గొండ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వదిలేసిన ప్రాజెక్టులను బిఆర్‌ఎస్ పూర్తి చేసిందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి అనుచరులు సబ్ స్టేషన్ పరికరాలను అమ్ముకున్నారని, కోమటిరెడ్డి స్వంత ఊరు బ్రాహ్మణ వెల్లంల సబ్ స్టేషన్ మాయమైందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రిగా కోమటిరెడ్డి ఏం చేస్తున్నారో చెప్పాలని అడిగారు. కోమటిరెడ్డి 4 సార్లు ఎంఎల్‌ఎ,మంత్రిగా పనిచేసి నల్గొండను పట్టించుకోలేదని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం నల్గొండకు మెడికల్
ఇచ్చిందని, నల్గొండకు బత్తాయి మార్కెట్, ఐటీ హబ్‌ను కెసిఆర్ ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. పది నెలల కాలంలో రెండు కిలోమీటర్ల రోడ్డును కోమటిరెడ్డి వేయించలేకపోయారని విమర్శించారు. సాగర్ నీళ్లు ఖమ్మం పోతున్నాయి.. కానీ నల్గొండకు రావడం లేదని పేర్కొన్నారు. మంత్రి పదవి కాపాడుకోవడానికి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News