రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఛైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి
మన తెలంగాణ / చౌటుప్పల్: నాణ్యమైన వంట నూనెలను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆయిల్ ఫెడ్ సంస్థ కృషి చేస్తుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఛైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి అన్నారు. చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ వంట నూనెల విక్రయ కేంద్రం (ధనలక్ష్మీ ఏజెన్సీ) ని ఆదివారం పురపాలక ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, సింగిల్ విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ…. ప్రజారోగ్యానికి హాని కలగకుండా విజయ ఆయిల్ సంస్థ నాణ్యమైన అన్ని రకాల నూనెలను తయారు చేసి అందిస్తుందని తెలిపారు. అందుకే విజయ నూనెలను రేషన్ దుకాణాల ద్వారా సైతం సరసమైన ధరలకు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, విజయ ఆయిల్ మేనేజర్ తిరుమలేశ్వర్‌రెడ్డి, అధికారులు సంజయ్‌రెడ్డి, సందీప్, సంతోష్, కౌన్సిలర్లు, పోలోజు శ్రీధర్‌బాబు, తాడూరి శిరీష పరమేష్, కొరగోని లింగస్వామి, కామిశెట్టి శైలజా భాస్కర్, సందగళ్ల విజయ, ఏజెన్సీ నిర్వాహకులు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.