Monday, January 20, 2025

కందుకూరులో దంపతుల హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడలో దంపతులు హత్యకు గురయ్యారు. కొత్తగూడ శివారులోని ఫామ్ హౌస్ లో దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా గుర్తించారు. భార్య మృతదేహం గదిలో ఉండగా భర్త భౌతికకాయం బయటపడి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఎందుకు హత్య చేశారో అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News