Friday, December 20, 2024

మున్సిపల్ అధికారుల తప్పిదమే దుర్ఘటనకు కారణం : టిడిపి ఇంచార్జీ నాగేశ్వర రావు

- Advertisement -
- Advertisement -

కందుకూరు నాళా పై కట్టడాలకు అనుమతులిచ్చి రహదారికి,కట్టడానికి మధ్య ఖాళీఉంచారని నాళా పై కట్టడాలకు ఎలా అనుమతులిచ్చారో వారికే తెలియాలని టిడిపి ఇంచార్జీ నాగేశ్వర రావు అన్నారు. మున్సిపల్ అధికారుల తప్పిదమే ఈ దుర్ఘటనకు కారణమని వారు వాపోయారు. సంఘటన జరిగిన చాలా సేపటికి కాని పోలీసులు రాలేదని, టిడిపి కార్యకర్తలే బాధితుల్ని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. కందుకూరు దుర్ఘటన జరగటం బాధాకరమని, అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు స్థానికంగా మా వంతు సాయం బాధిత కుటుంబాలకు అందజేస్తామని నాగేశ్వర రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News