Sunday, January 19, 2025

కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే న్యూజిలాండ్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ క్రమంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విలియమ్సన్.. తాజాగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకున్నారు.

కాగా.. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ గ్రూప్-స్టేజ్‌లోనే టీ20 ప్రపంచకప్ నుండి వైదొలగడం అందర్ని షాక్ కు గురి చేసింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో కివీస్‌ జట్టు గ్రూప్‌ దశ దాటి ముందుకు వెళ్లలేకపోవటం ఇదే తొలిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News