Monday, January 20, 2025

కివీస్‌ను ఆదుకున్న విలియమ్సన్..

- Advertisement -
- Advertisement -

సిల్హేట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు టామ్ లాథమ్ (21), డెవోన్ కాన్వే (12) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. హెన్రీ నికోల్స్ కూడా 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన పోరాటాన్ని కొనసాగించాడు.

బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించాడు. అతని డారిల్ మిఛెల్ (41) అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ (6) కూడా విఫలమయ్యాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన కేన్ విలియమ్సన్ 205 బంతుల్లో 11 ఫోర్లతో 104 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (42) తనవంతు పాత్ర పోషించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ నాలుగు వికెట్లు తీశాడు. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే న్యూజిలాండ్ మరో 44 పరుగులు చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News