Sunday, December 22, 2024

కేన్ విలియమ్సన్ తండ్రయ్యాడు!

- Advertisement -
- Advertisement -

న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి తండ్రి అయ్యాడు. కేన్ భార్య సారా బుధవారం ఆడపిల్లను ప్రసవించింది. ఈ విషయాన్ని కేన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కేన్, సారా దంపతులకు ఇప్పటికే ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తమ కుటుంబంలోకి మూడో బిడ్డ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందనీ, అందమైన మా బేబీకి స్వాగతం అని కేన్ పేర్కొన్నాడు.

కేన్, సారా ఎనిమిదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరు ఇంకా వివాహం చేసుకోలేదు. సారా ప్రసవ సమయం దగ్గరపడటంతో కేన్ ఆస్ట్రేలియా- న్యూజీలాండ్ మధ్య జరిగిన టీ20 సీరీస్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో టెస్ట్ లో కేన్ పాల్గొనే అవకాశం ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News