ముంబయి: కంగనా రనౌత్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను ‘అసలైన బ్లాక్‌బస్టర్’ అని పేర్కొంది. ‘మూవీ మాఫియా’ను లక్షం చేసుకుందని అభిప్రాయపడింది. అంతేకాక ‘నేను నా పని చేస్తున్నాను’ అని తెలిపింది. కొవిడ్ మహమ్మారి తర్వాత థియేటర్లలో మొదటి విజయవంతమైన, లాభదాయకమైన సినిమాగా ఈ సినిమాను పేర్కొంది. ఇదిలావుండగా ‘కశ్మీర్‌ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్‌లను ప్రశంసించింది. కంగనా ఇటీవలే ఆలియా భట్ నటించిన ‘గంగూభాయి కతియావాడి’ సినిమాను విమర్శించింది. మీడియా బాక్సాఫీస్ కోసం నంబర్‌లు వండాయని పేర్కొంది. కానీ తన వాదనకు బలాన్ని ఇచ్చే మూలాలను మాత్రం ఆమె పేర్కొనలేదు. ఇదిలావుండగా మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘కశ్మీర్ ఫైల్స్ కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లలో తొలి విజయవంతమైన, లాభదాయకమైన చిత్రం…నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే సినిమా మాఫియా, వారి భజనపరులు, అమ్ముడుపోయిన మీడియా మీకు వాస్తవాలు చెప్పవు. సినీ పరిశ్రమ నుంచి కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఎవరూ అభినందించరు, కానీ నేను అభినందిస్తున్నాను. ఈ విధంగా నేను నా వంతు కృషి చేస్తున్నాను’ అని పేర్కొంది.
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కంగనా ఏమంది?
- Advertisement -
- Advertisement -
- Advertisement -