- Advertisement -
సిమ్లా: తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు రావడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్ మండిపడ్డారు. తాను అసలు ఇంట్లోనే ఉండడంలేదని లక్ష రూపాయల కరెంట్ బిల్లు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. లక్ష రూపాయల కరెంట్ బిల్లును చూసి షాక్‌కు గురయ్యానని, హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు చేస్తే సిగ్గు అనిపిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న సోదరీ సోదరులను తాను ఒకటి కోరుతున్నానని, అందరం కలిసి సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తోడేళ్ల చెర నుంచి రాష్ట్రా కాపాడుకుందామని నినాదాలు చేశారు.
- Advertisement -