Wednesday, January 22, 2025

బాలీవుడ్ ప్రముఖులను విమర్శించిన కంగనా రనౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: రాజకీయవేత్తగా అవతరించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖులను తీసిపారేసినట్లు మాట్లాడింది. రాజ్ షమానీ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ  అనేక విషయాలే చెప్పింది.

బాలీవుడ్ లో ‘మీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా?’ అని అడిగినప్పుడు కంగనా ‘‘నేను బాలీవుడ్ వ్యక్తినని అనుకోవడం లేదు. బాలీవుడ్ మనుషులతో నేను ఫ్రెండ్ గా కూడా ఉండలేను.  బాలీవుడ్ వ్యక్తులు పూర్తిగా తమ గురించే ఆలోచించుకుంటారు. వారు మూగవారిగా, గొల్లభామలుగా, దిమ్మెలమాదిరిగా, బోలుగా ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయడం ఏమిటి? ఎక్కడ ఏమి జరుగుతుందో కూడా వారికి తెలియదు. వారు దేని గురించి పెద్దగా చర్చించరు’’ అన్నది.

‘‘మొత్తం పరిశ్రమ అలా ఎందుకుంటుంది?’’ అన్నప్పుడు కంగనా ’’నేను బాలీవుడ్ ను చాలా చూశాను. బాలీవుడ్ ప్రముఖులు రోటీన్ గా ఉంటారు. ఒకవేళ షూటింగ్ లేకుంటే  వారు ఉదయం లేవగానే ఎక్సర్సైజ్ చేస్తారు. మధ్యాహ్నం నిద్రపోతారు. తర్వాత లేచి జిమ్ కు వెళతారు. రాత్రిపూట పడుకోవడమో లేక టివి చూడ్డమో చేస్తారు’’ అంది. ‘‘వారు బ్రాండెడ్ బ్యాగులు, కార్లు, డైట్స్, ఎవరితో ఎవరు డేటింగ్ చేస్తున్నారు, ఏ జంట విడిపోయింది వంటి విషయాలే మాట్లాడుతుంటారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

‘‘బాలీవుడ్ లో డీసెంట్ వ్యక్తి నాకు కనిపించలేదు. బాలీవుడ్ పార్టీ అంటే నాకు ట్రౌమా వంటిది. ఆ పార్టీలన్నీ పైపై మెరుగులే. బాలీవుడ్ లోని వారంతా స్టుపిడ్ లు. వారు బ్యాగులు, కార్లు గురించి తప్ప వేరే ఏ విషయాలపై మాట్లాడరు’’ అంది.

కంగనా రనౌత్ రాబోవు చిత్రం ‘ఎమర్జెన్సీ’. అందులో అనుపమ్ ఖేర్ మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పడే, విశాఖ్ నాయర్, సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 2024 సెప్టెంబర్ 6న విడుదల కాబోతున్నది. ఈ సినిమాను జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ రూపొందించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News