Monday, December 23, 2024

‘చంద్రముఖి 2’.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘చంద్రముఖి 2’. స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ‌నివారం ఈ సినిమా నుంచి చంద్ర‌ముఖిగా మెప్పించ‌నున్న కంగ‌నా ర‌నౌత్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

బంగారు అభ‌ర‌ణాలు, ప‌ట్టు వ‌స్త్రాల‌తో  రాజ న‌ర్త‌కి చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగ‌నా ర‌నౌత్ లుక్ అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది. ఈ లుక్‌తో కంగ‌నా పాత్ర‌లో ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.  2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే.  దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News