Monday, December 23, 2024

నా సోదరిపై యాసిడ్ దాడి : కంగనా

- Advertisement -
- Advertisement -

 

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌతు హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది దేశంలో యాసిడ్ దాడులు పెరుగుతున్నాయని ఇటివల ఢిల్లీలో యాసిడ్ దాడి జరిగిందని తెలిపింది. ఈ నేపథ్యంలో కంగనా రనౌతు ఇన్ స్టా స్టోరీస్ లో గతంలో తమ కుటుంబంలో జరిగిన యాసిడ్ దాడి గురించి తెలిపింది. తన సోదరి రంగోలి యాసిడ్ దాడికి గురైందని తనకు 52 శస్త్ర చికిత్సలు జరిగాయని గుర్తు చేసింది. తన సోదరి శారీరకంగా మానసికంగా ఎంతో బాధపడిందని కంగనా తెలిపారు. ఆ సంఘటన తర్వాత తనపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందని భయపడుతున్నట్లు చెప్పింది. ఇప్పటికీ తను బయటకు వెళ్ళినప్పుడు భయంతో అప్పుడప్పుడు ముఖాన్ని చేతితో దాచుకుంటానని కంగనా రనౌతు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News