Friday, December 20, 2024

భారతీయ మహిళలు అత్యుత్తమం అనడానికి దీపిక నిదర్శనం: కంగనా రనౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రెజెంటర్లలో ఒకరైన దీపిక పదుకొణె భారతీయ మహిళలే అత్యుత్తమం అనడానికి నిదర్శనంగా నిలుస్తోందని నటి కంగనా రనౌత్ కొనియాడారు. ఈ మేరకు ఆమె ట్వీట్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టింది. అక్కడ(కార్యక్రమంలో) దీపికా పదుకొణె చాలా అందంగా ఉందని వ్యాఖ్యానించింది. ‘దీపిక ఎంత అందంగా ఉంది, దేశం మొత్తాన్ని ఒకచోట చేర్చి, దాని ప్రతిష్ఠను, ఖ్యాతిని ఆ సున్నితమైన భుజాలపై మోస్తూ, చాలా హుందాగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం అంత సులభం కాదు. దీపిక భారతీయ మహిళలు ఉత్తములని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది’ అని కంగనా పేర్కొంది.

Kangana tweet

Kangana Ranaut

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News