Monday, January 20, 2025

‘ఎమర్జన్సీ’ సమగ్రతను రక్షిస్తాం.. చిత్రంపై మా వైఖరి మారదు

- Advertisement -
- Advertisement -

నటి, దర్శకురాలు కంగన రనౌత్ తాను దర్శకత్వం వహించిన ‘ఎమర్జన్సీ’లో కట్‌ల కోసం సెన్సార్ బోర్డ్ నుంచి వినతులు అందాయని, కానీ ఆ సూచనలు ‘ఏమాత్రం సహేతుకం కావు’ అని, తన బృందం వైఖరి మారబోదని శుక్రవారం తెలియజేశారు. చిత్రంలో 13 కట్‌లను సెన్సార్ బోర్డ్ అడిగిందని ఒక వర్గం మీడియాలో వార్తలు వచ్చిన దృష్టా తన బృందం ‘చిత్రం ప్రామాణికతను కొనసాగించాలన్న దృఢనిశ్చయంతో’ ఉందని కంగన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నటి, బిజెపి ఎంపి నటించి, దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా ఉండడమే కాకుండా దివంగత ఇందిరా గాంధీ ప్రధాన పాత్ర పోషించారు.

చిత్రం విడుదలను ఆలస్యంచేసేందుకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదని సెన్సార్ బోర్డ్‌పై ఆమె ఇంతకు ముందు ఆరోపణలు చేశారు. చిత్రం ఈ నెల 6న విడుదల కావలసి ఉన్నది. ‘కట్‌ల కోసం మాకు వినతులు అందాయి, అయితే, చిత్రంపై సమాచారం ఎల్లప్పుడూ స్వాగతనీయమే, కానీ కొన్ని సూచనలు సహేతుకంగా కనిపించలేదు& అయితే, చిత్రంచూసిన చాలా మంది చారిత్రకవేత్తలు, రివ్యూ కమిటీ సభ్యులు ఒక నేతను అత్యంత విశ్వసనీయంగా చిత్రించారని మెచ్చుకోవడం గమనార్హం’ అని కంగన పేర్కొన్నారు. శిరోమణి అకాలీ దళ్‌తో సహా సిక్కు సంస్థలు చిత్రం విడుదలకు అభ్యంతరం వ్యక్తంచేసిన తరువాత ‘ఎమర్జన్సీ’ వివాదంలో ఇరుక్కున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News