Friday, December 20, 2024

కంగనా రనౌత్ చెంప పగులగొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: బాలీవుడ్ నటి, మండీ లోక్ సభ నుంచి గెలిచిన ఎంపీ కంగనా రనౌత్ చెంప చెళ్లు మనిపించింది. ఎయిర్ పోర్ట్ లోని సిఐఎస్ఎఫ్ లేడి కానిస్టేబుల్. ఈ ఘటన మోహాలి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. కాగా ఈ ఘటన తర్వాత ఆ అధికారిణిని సస్పెండ్ చేశారు.

ఈ విషయంపై ఆ లేడి కానిస్టేబుల్ ను  ప్రశ్నించినప్పుడు పంజాబ్ లో జరిగిన రైతు ఉద్యమంపై… ముఖ్యంగా పంజాబ్ మహిళలకు వ్యతిరేకంగా తప్పుడు కూతలు కూసిందని వివరించింది.

కంగనా రనౌత్ విలేకరులతో మాట్లాడుతూ ‘ సెక్యూరిటీ చెకింగ్ అప్పుడు ఆమె దుర్భాషలాడింది, ముఖం మీద కొట్టింది’ అని పేర్కొంది. ఈ ఘటన ఛండీగఢ్ విమానాశ్రయంలో జరిగింది.

‘సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ చెక్ అప్పడు సెకండ్ క్యాబిన్ నుంచి వచ్చి నా చెంప పగుల గొట్టింది. పైగా దుర్భాషలాడింది. నేను ఎందుకిలా చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు, ఆమె తాను రైతుల నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పింది. నేను సురక్షితంగా ఉన్నాను. కానీ పంజాబ్ లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం విషయంలో కంగారుపడుతున్నాను’’ అని కంగనా చెప్పుకొచ్చింది.

ఇదిలావుండగా  ఈ విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు లభించలేదని ఎయిర్ పోర్ట్ డిసిపి కుల్జిందర్ సింగ్  ఓ దినపత్రిక విలేకరికి తెలిపారు.

దీనిపై హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకుర్ ప్రతిస్పందిస్తూ ‘ఇది చాలా దురదృష్టకరం. ఎవరూ మరొకరికీ హానీ కలిగించకూడదు. కంగనా రనౌత్ ఓ పార్టీ మీటింగ్ లో పాల్గొనడానికి ఢిల్లీకి వెళుతోంది. నేను కూడా సాయంత్రం ఛండీగఢ్ విమానాశ్రంయం నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వెళుతుండగా ఇది జరిగింది’’ అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News