Monday, December 23, 2024

నా కెరీర్‌లో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు: కంగనా

- Advertisement -
- Advertisement -

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో అల‌రించున్నారు. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో పాటు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ.. ‘‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్ల‌లో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విష‌య‌మేమంటే.. నాకు అవకాశం కావాల‌ని ఎవ‌రినీ అడ‌గ‌లేదు. తొలిసారి డైరెక్ట‌ర్ పి.వాసుగారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్ర‌తో పాటు ప్ర‌తీ పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయ‌న‌కే ద‌క్కుతుంది.

లారెన్స్ మాస్ట‌ర్ చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌న చిన్న డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో, ద‌ర్శ‌కుడు రేంజ్‌కు ఎదిగారు. ఎంతో మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా చిరున‌వ్వుతో స్వీక‌రిస్తారు. అలాంటి గుణం చాలాత‌క్కువ మందికే ఉంటుంది. తోట‌త‌ర‌ణిగారు, నీతూ లుల్లా, రాజ‌శేఖ‌ర్‌గారు .. ఇలా చాలా మంది గొప్ప టెక్నీషియ‌న్స్‌తో వ‌ర్క్ చేశాను. ఇక వ‌డివేలుగారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న ఈ సినిమాలో త‌న‌దైన స్టైల్లో అంద‌రినీ న‌వ్విస్తారు. కీర‌వాణిగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ప్ర‌పంచమంతా ఆయన గురించి గొప్ప‌గా మాట్లాడింది. ఆయ‌న‌కు ఆస్కార్ అవార్డ్ వ‌స్తే నాకే వ‌చ్చిన‌ట్లు సంతోష‌ప‌డ్డాను. ఆయ‌న మ్యూజిక్ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌టం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఇక సుభాస్క‌ర‌న్‌గారు ఎంతో మంచి వ్య‌క్తి. చాలా ప్యాష‌న్‌తో గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయ‌న రూపొందించిన చంద్ర‌ముఖి 2 మంచి విజ‌యాన్ని సాధిస్తుంది’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News