- Advertisement -
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే బాలీవుడ్‌పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ తనకు సపోర్ట్ చేయదని ఎప్పటి నుంచో చెప్పుకొస్తోంది ఈ వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్.
తాజాగా ‘‘అజయ్ దేవగణ్ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ ఇతర చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. ఇక అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెబుతాడు. కానీ ఆ మూవీ ట్రైలర్‌ను షేర్ చేయడం, ట్వీట్ చేయడం మాత్రం చేయడు. కాబట్టి వారి గురించి నేను ఏం మాట్లాడలేను. అలాగే అమితాబ్ బచ్చన్ నా సాంగ్ టీజరన్‌ను ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించారు. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడను. అజయ్ దేవగణ్ ఇతరులు చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు. కానీ నా చిత్రాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్ చేసిన అర్జున్ రాంపాల్‌కు ఎంత కృతజ్ఞతతో ఉంటానో, నా సినిమాలో అజయ్ దేవగణ్ నటించినా అలాగే గొప్పగా ఫీల్ అవుతా’ అని తెలిపింది కంగనా రనౌత్.
- Advertisement -