- Advertisement -
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ వార్తను ఆమె మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. కంగనా మే 8 న కరోనా వైరస్ సోకింది. కొన్ని రోజులుగా ఆమె ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఫైర్ బ్రాండ్ క్వీన్ తన క్షేమం కోరిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. కంగనా రనౌత్ ప్రస్తుతం ‘టికు వెడ్స్ షేరు’ అనే లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్ పై ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Kangana Ranaut Tested Negative For COVID-19
- Advertisement -