Friday, November 22, 2024

నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా.. వ్యవసాయ చట్టాలపై కంగన ప్రకటన

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాల నుంచి విమర్శలు, సొంత పార్టీ నుంచి మందలింపు ఎదురుకావడంతో 2021లో రద్దయిన వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు బిజెపి ఎంపి కంగనా రనౌత్ బుధవారం ప్రకటించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2021లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలంటూ కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వ్యవసాయ చట్టాలను తీవ్రంగా ప్రతిఘటించిన వారిలో హర్యానా రైతులు ఉండగా ఇప్పుడు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వ్యవసాయ చట్టాలపై కంగన చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి.

కంగన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా బుధవారం స్పష్టం చేశారు. కాగా..వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా కంగన ప్రకటించారు. తాను నటినే కాక బిజెపి సభ్యురాలినని కూడా తాను గుర్తుంచుకోవాలని, ఇక తన ప్రకటనలు కూడా బిజెపి విధానాలకు అనుగుణంగానే ఉండాలని ఆమె పేర్కొన్నారు. వివాదాస్పద చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు పలువురిని అసంతృప్తికి గురిచేసి ఉంటాయని, అందుకు తాను చింతిస్తున్నానని ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News