Friday, September 27, 2024

కంగనా రనౌత్ సినిమా ‘ఎమర్జెన్సీ’ కట్స్ తో విడుదలచేయొచ్చు: సెన్సార్ బోర్డ్

- Advertisement -
- Advertisement -

ముంబై: బిజెపి ఎంపీ కంగనా రనౌత్ తీసిన సినిమా ‘ఎమర్జెన్సీ’ ని తాము సిఫార్సు చేసిన కట్స్ తో విడుదల చేయాలనుకుంటే తాము సర్టిఫికేట్ జారీ చేయగలమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్(సిబిఎఫ్ సి) బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975లో విధించిన ‘అత్యవసర పరిస్థితి’(ఎమర్జెన్సీ) మీద తీసింది.

ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 6న విడుదల కావలసింది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ లభించనందున ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమాను స్వయంగా కంగనా రనౌత్ నిర్మాత, దర్శకత్వం వహించి నటించి తీసింది. ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.

శిరోమణి అకాలీదళ్ సహా కొన్ని సిక్కు సంస్థలు ఈ సినిమా మీద ఆక్షేపణలు తెలిపాయి. తమ వర్గాన్ని ఈ సినిమాలో తప్పుగా చిత్రీకరించారని వారు అంటున్నారు. దాంతో సిబిఎఫ్ సి ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయకుండా నిలిపి ఉంచింది. కాగా ఈ సినిమాపై సెప్టెంబర్ 25లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు సిబిఎఫ్ సిని ఆదేశించింది. ఈ సినిమాకు సహ నిర్మాత అయిన జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రయిజెస్ హైకోర్టును ఆశ్రయించి సిబిఎఫ్ సి సర్టిఫికేట్ జారీ అయ్యేలా ఆదేశాలివ్వాలని కోరింది.

సిబిఎఫ్ సి తరఫున అభినవ్ చంద్రచూడ్, జీ ఎంటర్ టైన్మెంట్ తరఫున శరణ్ జగత్యానీ తమ వాదనలు చేశారు. చివరికి కట్స్ తో విడుదలచేసేట్టయితే సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ బోర్డు అంటోంది. అయితే జీ తరఫు న్యాయవాది కట్స్ కు అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకోడానికి సమయం కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News