Monday, December 23, 2024

భారత మొదటి ప్రధాని బోస్: కంగనా వ్యాఖ్యలు వైరల్!

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టడంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని మించినవారు లేరు. ఒక్కమాటలో చెప్పాలంటే కంగనా ఎక్కడుంటే వివాదాలు అక్కడుంటాయి. కొన్నేళ్ల క్రితం భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని ఆమె కామెంట్ చేసి, వివాదానికి ఆజ్యం పోశారు. తాజాగా తను చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్య నెట్టింట వైరల్ అవుతోంది.

ఇటీవల ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె భారత మొట్టమొదటి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యానించారు. అయితే ఇంటర్య్వూ చేస్తున్న వ్యక్తి భారత మొదటి ప్రధాని బోస్ కాదని చెప్పినా ఆమె వినకుండా ‘మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బోస్ ఎక్కడకు వెళ్లారు? ఆయన ఎలా అదృశ్యమయ్యారు? అని ప్రశ్నించారు.

బోస్ 1945లో మరణించగా, భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిది. కంగనా వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ‘కంగనా లెక్క ప్రకారం ఇండియాకు 2014లో స్వాతంత్ర్యం వచ్చింది. మన మొదటి ప్రధాని బోస్. సర్దార్ పటేల్ కు ప్రధాని పదవి దక్కలేదు.. ఎందుకంటే ఆయనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి జోకులు వినాలంటే కంగనా రనౌత్ కు ఓటు వేయండని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News