నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుండగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజిఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన తలైవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్‌కు ఈ సినిమా కథ నచ్చింది. ఈ చిత్రంలో జయలలితగా ఆమే ఆదరగొట్టింది.
ఈ సినిమా తర్వాత ఆమె టాప్ చైర్లో ఉంటుందని ముందే చెప్పా. అదే జరుగుతుంది అని చెప్పారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ… ‘మా ప్రొడ్యూసర్ విష్ణుకి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోంది. కానీ సినిమా చూసినప్పుడు ఆయనే రైట్ అనిపించింది’ అని అన్నారు. విజయ్ మాట్లాడుతూ… అరవింద్ స్వామి ఈ సినిమాకు బిగ్ పిల్లర్. జయలలిత క్యారెక్టర్‌లో కంగనా ఒదిగిపోయింది. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్, క్రియేటివ్ హెడ్ బృందా ప్రసాద్, భాగ్యశ్రీ, తిరుమల్ రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.