Sunday, December 22, 2024

ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని అద్భుతమైన మూవీ

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ’కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ’కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శివ మాట్లాడుతూ “ఈ కథను ఒక భారీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించాం.

నిర్మాత జ్ఞానవేల్ సహకారం వల్లే కంగువ చేయగలిగాం. సూర్యకి కథ చెప్పినప్పుడు ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదని ఆయన చెప్పడంతో నాకు ఎంతో నమ్మకాన్నిచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు ఎలాంటి గొప్ప ఫీలింగ్ కలిగిందో థియేటర్‌లోనూ అలాంటి అనుభూతికి లోనవుతారు”అని అన్నారు. ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ “నవంబర్ 14న ’కంగువ’ అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తోంది.

సినిమా గొప్ప విజయాన్ని అందుకుంటుంది”అని తెలిపారు. హీరో సూర్య మాట్లాడుతూ “ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతినివ్వాలనే ’కంగువ’ లాంటి గొప్ప సినిమా చేశాను. అందుకే రెండున్నరేళ్ల సమయం తీసుకుని ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అద్భుతమైన మూవీని చేశాం”అని తెలియజేశారు. ఈ సమావేశంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి, రైటర్ రాకేందు మౌళి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News