Monday, December 23, 2024

‘కంగువ’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ’కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. అక్టోబర్ 10వ తేదీన రావాల్సిన ‘కంగువ’ మరిన్ని హంగులతో ముస్తాబై నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ’కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ’కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News