Tuesday, July 2, 2024

‘కంగువ’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతష్టాత్మక మూవీ ’కంగువ’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ’కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

’కంగువ’ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది ఈ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న ’కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News