Wednesday, January 22, 2025

భారత్ జోడో యాత్రలో కనిమొళి

- Advertisement -
- Advertisement -

ఫరిదాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సారథ్యంలో హరియాణాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో డిఎంకె ఎంపి కనిమొళి పాల్గొన్నారు. భారతదేశ వైవిధ్యంపై చేపట్టిన పాదయాత్రలో భాగస్వామికావడం సంతోషంగా ఉందని ఆమె శుక్రవారం తెలిపారు. దేశప్రజలను సంఘటిత పరిచేందుకు రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్రపై ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నేత కనిమొళి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాహుల్‌తో కలిసి కనిమొళి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. యాత్ర ఫరిదాబాద్‌లో ప్రవేశించకుముందు శుక్రవారం గురుగ్రామ్‌లోని సోహ్నలో శుక్రవారం యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ సారథ్యం నిర్వహించనున్న భారత్ జోడో యాత్ర 7న తమిళనాడు నుంచి ప్రారంభమైంది. ఇంతవరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పాదయాత్ర పూర్తయింది. కాగా శుక్రవారం హరియాణాలో తొలి దశ భారత్ జోడో యాత్ర ముగిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News