Monday, January 20, 2025

కాణిపాకం దేవస్థానంలో మరో వివాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాణిపాకం దేవస్థానంలో మరో వివాదం తలెత్తింది. ఈ దేవస్థానంలో వంశపారంపర్య అర్చకుల చేత పూజలు చేయించాలనే కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు.

వంశపారంపర్య అర్చకులను కాదని బయటి నుంచి నలుగురు అర్చకులను తీసుకొచ్చి గర్భాలయంలో పూజలు చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే పలుమార్లు భంగపడిన ఆలయ పాలకమండలి, అధికారుల తీరుతో దేవస్థానంలో పాలన గాడి తప్పుతుందని అర్చకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News