Thursday, January 23, 2025

అలిపిరి ఘటన చంద్రబాబే చేయించుకున్నారా?: కన్నబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఎ నిర్ధారించిందని వైసిపి ఎంఎల్‌ఎ కన్నబాబు తెలిపారు. శనివారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఇందులో కుట్రకోణంపై దర్యాప్తు జరపాలని వైఎస్ జగన్ గతంలో కోరారన్నారు. దాడి ఘటనపై సోషల్ మీడియాతో పాటు కొన్ని న్యూస్ పేపర్లు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లో మీడియా తమకు తోచిన విధంగా కథనాలు రాస్తున్నాయని దుయ్యబట్టారు. హత్యాయత్నంపై ఎన్‌ఐఎ మరింత లోతుగా విచారణ చేయాలని పిలుపునిచ్చారు. కుట్రకోణం ఉందంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియాకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. దాడి జరిగిన రోజే అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు చెప్పగానే డిజిపి ప్రెస్‌మీట్ పెట్టేశారని కన్నబాబు గుర్తు చేశారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే గతంలో డిజిపి స్టేట్‌మెంట్లు ఎలా ఇచ్చారని, హత్యాయత్నం ఘటనపై నిగ్గు తేల్చాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.

Also Read: మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి: పవన్ కల్యాణ్

నిందితుడికి నేర చరిత్ర ఉందని విచారణలో తేలిందన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కేసుల్లేవని తప్పుడు కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టులు ఏం చెప్పకుండానే ఎల్లో మీడియా తీర్పులు ఇస్తుందా? అని చురకలంటించారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన ఎయిర్‌పోర్టులోకి కత్తి పట్టుకొని ఒక వ్యక్తి ఎలా ప్రవేశించగలిగాడన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో లోతైన దర్యాప్తు చేయాలని కోరడం తప్పా? అని కన్నబాబు నిలదీశారు. అలిపిరి ఘటన అప్పటి సిఎం చంద్రబాబు నాయుడే చేయించుకున్నారని తాము ఎప్పుడైనా అన్నామా? అని ఎద్దేవా చేశారు. కేవలం సానుభూతి కోసమే చంద్రబాబు అలిపిరి ఘటన చేయించుకుంటే ప్రజలు ఓట్లు కుమ్మరించేయాలి కదా? అని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో మోసపోయామని ఆయన కుటుంబీకులే పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. సిఎం జగన్ అంటే మీలా కుటుంబ విలువల్లేని వ్యక్తి కాదన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడని కన్నబాబు దుయ్యబట్టారు. సిఎం జగన్‌ను కించపరుస్తూ డిఎస్ పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడన్నారు. డిఎస్ ఒళ్లు దగ్గర పెట్టుకొని స్పృహతో మాట్లాడాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News