Friday, December 27, 2024

బిజెపికి కన్నా రాజీనామా…. త్వరలో టిడిపి గూటికి !

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరుతలో కలిసి గురువారం బిజెపికి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర శాఖ పనితీరు పట్ల గత కొద్దికాలంగా ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే రాష్ట్ర శాఖను సరిదిద్దడంలో పార్టీ కేంద్ర నాయకత్వం నిర్లక్ష్య వైఖరి పట్ల అసంతృప్తితో కన్నా పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుల వ్యవహార శైలి పట్ల కూడా ఆయన బాహాటంగానే గతంలో విమర్శలు గుప్పించారు. త్వరలోనే ఆయన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News