- Advertisement -
హైదరాబాద్: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీలో చేరారు. గురువారం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టిడిపి కండువా కప్పుకున్నారు.
కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా టిడిపిలో చేరారు. వారికి కూడా చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
- Advertisement -