Sunday, December 22, 2024

కన్నా లక్ష్మీనారాయణ ఒక బిచ్చగాడు: అంబటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణపై రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కన్నా లక్ష్మీనారాయణ దూషించడం సరికాదని, ఎవరి మీదా పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టడం లేదన్నారు. టీడీపీలోకి రావాలని కన్నా లక్ష్మీనారాయణ తన కార్యకర్తల వెంటపడుతున్నారని మండపడ్డారు. ఎవరి మీదా అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.

నువ్వు ఏమైనా పెద్ద వస్తాదువా.. బిచ్చగాడివి అని తీవ్రంగా విమర్శించారు. తన మాట వినలేదని డీఎస్పీ, ఎస్పీపై కన్నా లక్ష్మీనారాయణ బురద జల్లుతున్నాడన్నారు. బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబును తిట్టిన విషయం మర్చిపోయావా?.. చిరంజీవికి ఓట్లు వేసినందుకు కాపులను నువ్వు తిట్టలేదా? అని కన్నాను అంబటి రాంబాబు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News