Sunday, December 22, 2024

జగన్ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుతాం: కన్నా

- Advertisement -
- Advertisement -

అమరావతి: తప్పుడు పత్రాలు, అసత్య ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు బనాయించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ వంటి మంచి కార్యక్రమానికి అవినీతిని ఆపాదించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి రాజకీయాలపై ప్రజా ఉద్యమం, వీధి పోరాటాలు చేయడానికి ఆంధ్రప్రజలు సిద్దంగా ఉండాలని కన్నా పిలుపు నిచ్చారు. ప్రజలను చైతన్యవంతులను చేసి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుతామని హెచ్చరించారు.

Also Read:  ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News