Monday, December 23, 2024

భూకబ్జా కేసులో కన్నారావు అనుచరుడు డానియల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిటీబ్యూరో : భూకబ్జా కేసులో కన్నారావు ప్రధాన అనుచరుడిని రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండెకరాలు భూమిని కన్నారావు అనుచరులు కబ్జాకు య త్నించారు. భూమిలో ఒఎస్‌ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపడుతుండగా రెండెకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అడ్డువచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. అక్కడ అడ్డుగా పెట్టిన వాటిని వారు కాల్చివేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు 38మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 10మందిని అప్పుడే అరెస్టు చేసిన పోలీసులు 28 మంది కోసం గాలిస్తున్నారు. అందులో కన్నారావు, అతడి ప్రధాన అనుచరుడు డానియల్ ఉన్నారు. ఎట్టకేలకు డానియల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న కన్నారావు సింగపూర్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News