Wednesday, January 22, 2025

ప్రియురాలు పవిత్ర కోసం..నిజ జీవితంలో విలన్‌గా దర్శన్

- Advertisement -
- Advertisement -

కన్నడ నటుడు దర్శన్ తూగ్‌దీప హత్యానేరాన్ని ఇతరులపై మోపడానికి యత్నించాడు. ముగ్గురికి తలో 5 లక్షల రూపాయలు ఇస్తానని ఆశచూపి ,వారిని తన బదులు జైలుకు పంపించాలని చూశాడని పోలీసులు గురువారం తెలిపారు. తన ప్రియురాలు, సహ నటి పవిత్ర గౌడ పట్ల అసభ్యంగా వ్యవహరించాడని రేణుకా స్వామి అనే వ్యక్తిని ఈ నటుడు చంపివేశాడని, బెంగళూరులోని ఓ మురికికాలువలో పడేశాడని అభియోగాలు వెలువడ్డాయి. దీనితో దర్శన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్టు అయిన 13 మందిలో నటి పవిత్ర గౌడ కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చట్టం ప్రకారం అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టామని బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానంద తెలిపారు.

దోషులు ఎవరైనా చట్టప్రకారం నిర్థారించుకుని శిక్షలు పడేలా చేస్తామని స్పష్టం చేశారు ప్రియురాలు పవిత్రకు తరచూ బూతు మాటలతో ఫోన్లు రావడం, వాట్సాప్ సందేశాలు వెలువడుతూ ఉండటంతో ఈ దిశలో నటుడు దర్శన్ ఈ పనిచేస్తున్నది ఎవరనేది తెలుసుకునేందుకు చిత్రదుర్గలోని తన సంఘానికి చెందిన రాఘవేంద్ర అలియాస్ రఘు అనే వ్యక్తిని రంగంలోకి దింపాడు. చివరికి రేణుకాస్వామిని గుర్తించి ఆయనను ఇంటినుంచే పట్టుకుని వెళ్లారని, తరువాత ఆయన శవం పలు గాయాలతో కాలువలో దొరికిందని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News