Sunday, December 22, 2024

దంపతులను కారుతో ఢీకొన్న కన్నడ నటుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బెంగళూరులో కన్నడ నటుడు నాగభూషణ తన కారుతో ఓ జంటను ఢీకొట్టారు.ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది.నటుడు నాగభూషణ శనివారం రాత్రి తన కారులో ఉత్తరహళ్లినుంచి కొననకుంటేకు వెళ్తున్న సమయంలో వసంతపుర మెయిన్‌రోడ్డు వద్ద ఫుట్‌పాత్‌పై వెళ్తున్న ప్రేమకృష్ణ దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రేమ(48) మృతి చెందింది. కృష్ణ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కుమారస్వామి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేగం , నిర్లక్ష డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బ్రీత్ అనలైజర్ పరీక్షలో నటుడు ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలలేదని, అందువల్ల అతని బ్లడ్ వాంపిల్‌ను పరీక్ష కోసం పంపించినట్లు సౌత్‌జోన్ ట్రాఫిక్ డిసిపి శివప్రకాశ్ చెప్పారు. నాగభూషణను బెయిలుపై విడుదల చేశారు.ఆయన మొదట తన కారుతో దంపతులను ఢీకొట్టిన తర్వాత నేరుగా వెళ్లి ఎలక్ట్రిక్ పోల్‌ను ఆయనే తన కారులో దంపతులను చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నాగభూషణ ఇటీవల ‘ కౌసల్య సుప్రజ రామ’ చిత్రంలో నటించాడు.‘ ఇక్కత్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకున్నారు. ‘బడవ రాస్కెల్ ’ చిత్రంలో ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా నామినేట్ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News