Monday, December 23, 2024

కన్నడ నటుడు గుండెపోటుతో కన్నుమూత!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:కన్నడ నటుడు నితిన్ గోపి(39) గుండెపోటుతో కన్నుమూశారు. ‘పునర్వివాహ’ సీరియల్‌లో ఆయన చాలా పేరు తెచ్చుకున్నారు. చిన్న వయస్సులోనే ఆయన కన్నుమూయడం అభిమానులను కలవరపరిచింది. గుండెపోటు రాగానే ఆయనను ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. బెంగళూరులోని ఇట్టమడులో ఆయన నివసించేవారు. ఛాతీలో నొప్పి రాగానే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఆయన చికిత్సకు రెస్పాండ్ కాలేదు.

నితిన్ గోపి కన్నడ సినిమాలు, టివి షోల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘హల్లో డాడీ’ సినిమాలో ఫ్లూట్ ప్లేయర్ పాత్రతో ఆయనకు ఓ బ్రేక్‌థ్రూ దక్కింది. దాంట్లో ఆయన ప్రముఖ నటుడు విష్ణువర్ధన్‌తో కలిసి నటించారు. ఆయన ఇంకా కేరలిడ కేసరి, ముత్తినంత హెండతి, నిశబ్ద, చిరబాంధవ్య తదితర చిత్రాల్లో నటించారు. శృతి నాయుడు రూపొందించిన ‘పునర్వివాహ’ సీరియల్‌లో, ‘హర హర మహదేవ్’ సీరియల్‌లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఓ కొత్త సీరియల్‌కు దర్శకత్వం నెరపాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయనను మృత్యువు కబళించింది. కొన్ని రోజుల క్రితమే సంపత్ రామ్ అనే మరో కన్నడ నటుడు సైతం ఆత్మహత్య చేసుకోవడంతో షాక్‌కు గురైన కన్నడ సినిమా రంగం ఇప్పుడు నితిన్ గోపి కన్నుమూతతో కలవరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News