Monday, December 23, 2024

కన్నడ సినీ నటుడు రాజేష్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

Kannada Actor Rajesh Passed away at 82

బెంగళూరు: ప్రముఖ కన్నడ సినీ నటుడు 82 ఏళ్ల రాజేష్ శనివారం నాడిక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కళాతపస్విగా కన్నడ చిత్ర సీమలో పేరుపొందిన రాజేష్ 150కి పైగా చిత్రాలలో నటించారు. బెంగళూరులో జన్మించిన రాజేష్ అసలు పేరు మునిచౌడప్ప. రంగస్థలంలో నటించే కాలంలో ఆయన పేరు విద్యాసాగర్. 1960లో వీరసంకల్ప చిత్రంతో కన్నడ సినీరంగంలోకి ప్రవేశించారు. 1968లో నమ్మ ఊరు(మన ఊరు) చిత్రంలో నటించిన ఆయన తన పేరును రాజేష్‌గా మార్చుకున్నారు. కప్పు బిలుపు, అరడు ముఖ, పుణ్య పురుష, కనికె, బృందావన తదితర 150కి పైగా చిత్రాలలో ఆయన నటించారు. రాజేష్ మృతి పట్ల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, హెచ్‌డి కుమారస్వామి, పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు.

Kannada Actor Rajesh Passed away at 82

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News